SPOT VOICE
Newspaper Banner
Date : 11 July 2026, 1:15 pm Posted By : SPOT VOICE MEDIA

హసన్‌పర్తి పెద్దచెరువులో మహిళ మృతదేహం లభ్యం

స్పాట్ వాయిస్,  హసన్‌పర్తి,  హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని పెద్దచెరువులో ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.