SPOT VOICE
Newspaper Banner
Date : 22 July 2026, 7:57 pm Posted By : SPOT VOICE MEDIA

అంగన్వాడీ సెంటర్ ను సందర్శించిన డీడబ్ల్యూఓ

స్పాట్ వాయిస్, రేగొండ : రేగొండ మండలం నారాయణపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1ను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీడబ్ల్యూఓ మల్లీశ్వరి సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహించిన సామూహిక సీమంతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మహిళా సాధికారత (మిషన్ శక్తి) సిబ్బంది జి.అనూష, మమత, జెండర్ స్పెషలిస్ట్ పాల్గొన్నారు. కాగా, కేంద్రంలోని పిల్లల తల్లులకు మమత బాల్యవివాహాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గర్భిణులు, తల్లులు, అంగన్వాడీ టీచర్ మాలతి, పారిజాతం, పిల్లలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.