SPOT VOICE
Newspaper Banner
Date : 31 July 2026, 10:31 am Posted By : SPOT VOICE MEDIA

మాందారిపేట వద్ద టీచర్లు ప్రయాణిస్తున్న ఆటోకు యాక్సిడెంట్

స్పాట్ వాయిస్, క్రైమ్ : హనుమకొండ నుంచి విధులకు వెళ్తున్న ఉపాధ్యాయులతో ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనానికి శాయంపేట మండలం మాందారిపేట సమీపంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు ఉపాధ్యాయులు గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.