SPOT VOICE
Newspaper Banner
Date : 04 July 2026, 6:36 am Posted By : SPOT VOICE MEDIA

రేగొండలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి దారుణ హత్య

స్పాట్ వాయిస్ ,రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో గురువారం రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న జట్టి శ్రావణ్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉండగా, హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య మౌనిక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.