SPOT VOICE
Newspaper Banner
Date : 28 June 2026, 1:15 pm Posted By : SPOT VOICE MEDIA

అవినీతి ఆరోపణలపై ఇద్దరు పోలీసు అధికారుల సస్పెన్షన్.. 

స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అవినీతి ఆరోపణలపై వరుస చర్యలు కొనసాగుతున్నాయి. వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్‌కు అటాచ్‌గా ఉన్న ఎస్‌ఐ షేక్ హమీద్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇద్దరు అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావును కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఆర్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం. వరుసగా పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకోవడం కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది.