SPOT VOICE
Newspaper Banner
Date : 18 June 2026, 5:30 pm Posted By : SPOT VOICE MEDIA

రైతు భరోసా డేట్ ఫిక్స్..

ఈనెల 30 నుంచి తొమ్మిది రోజుల పాటు జమ

స్పాట్ వాయిస్, బ్యూరో: రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. వానా కాలంలో సాగు సీజన్ ప్రారంభం కావడంతో రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫైనల్ చేసింది. ఈ నెల 30 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈసారి నిధుల పంపిణీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర నియోజకవర్గాన్ని వేదికగా మార్చుకున్నారు. జూన్ 30న మధిరలో నిర్వహించేబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. ఒక్క రోజులో కాకుండా వరుసగా 9 రోజుల పాటు ఈ నగదు జమ ప్రక్రియ కొనసాగుతుంది.