కొత్తపల్లి గోరి మండల సర్పంచుల ఫోరం కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
స్పాట్ వాయిస్, రేగొండ: గ్రామాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలోపేతం, సర్పంచుల ఐక్యత లక్ష్యంగా ఏర్పాటైన కొత్తపల్లి గోరి మండల సర్పంచుల ఫోరం (రిజిస్టర్డ్) నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం బుగులోని జాతర గుట్టలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని 16 మంది సర్పంచులు హాజరై పరస్పర చర్చలు జరిపి, ఏకాభిప్రాయం మేరకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లెల శామ్యూల్‌ను గౌరవ అధ్యక్షులుగా, నండ్రే సునీత రవిని అధ్యక్షురాలిగా, నిమ్మల శంకర్‌ను ఉపాధ్యక్షుడిగా, కిరణ్ కుమార్ రొడ్డను ప్రధాన కార్యదర్శిగా, సరిత...