SPOT VOICE
Newspaper Banner
Date : 07 June 2026, 9:48 pm Posted By : SPOT VOICE MEDIA

కొత్తపల్లి గోరి మండల సర్పంచుల ఫోరం కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

స్పాట్ వాయిస్, రేగొండ: గ్రామాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలోపేతం, సర్పంచుల ఐక్యత లక్ష్యంగా ఏర్పాటైన కొత్తపల్లి గోరి మండల సర్పంచుల ఫోరం (రిజిస్టర్డ్) నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం బుగులోని జాతర గుట్టలో  నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని 16 మంది సర్పంచులు హాజరై పరస్పర చర్చలు జరిపి, ఏకాభిప్రాయం మేరకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లెల శామ్యూల్‌ను గౌరవ అధ్యక్షులుగా, నండ్రే సునీత రవిని అధ్యక్షురాలిగా, నిమ్మల శంకర్‌ను ఉపాధ్యక్షుడిగా, కిరణ్ కుమార్ రొడ్డను ప్రధాన కార్యదర్శిగా, సరిత విజయేందర్‌ను కోశాధికారిగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా జక్కుల మానస సాంబయ్య, నడిపెల్లి శాంతాదేవి వెంకటరావు, సాధు సుమలత ధర్మేందర్, బొజ్జం మమత సురేష్ ఎంపికయ్యారు. అలాగే జవ్వాజీ రమేష్‌ను మీడియా ఇన్‌చార్జిగా నియమించగా, పల్లెబోయిన బుచ్చపతి, కాసెట్టి సక్కుబాయి రాజన్నలను సలహాదారులుగా ఎంపిక చేశారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.