SPOT VOICE
Newspaper Banner
Date : 22 June 2026, 3:39 pm Posted By : SPOT VOICE MEDIA

ప్రతీ ఎకరానికి సాగునీరు ప్రభుత్వ లక్ష్యం

కడియంతోనే అభివృద్ధి సాధ్యం..
జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: ప్రతీ ఎకరానికి సాగునీరు అందించడమే కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని, స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి కడియం శ్రీహరితో సాధ్యమని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో కెనాల్ పనులను సందర్శించిన ఆయన పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన వివరించారు. సూపర్ వైజర్ ధనుంజయ అక్కడికి వచ్చి కాలువ పనులపై రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రతీ ఎకరం నీటితో నిండుకుండలా ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం 1400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల నరేందర్ వరలక్ష్మి, జిల్లా నాయకులు గాదే మహేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కూటికంటి ఉపేంద్ర అనిల్, యువసేన అధ్యక్షుడు వడ్లకొండ శివప్రసాద్, వార్డ్ నెంబర్లు తాళ్లపెల్లి అశోక్, మహేష్ గౌడ్, జెట్టపోయిన సమ్మయ్య, పెండల సత్యనారాయణ, అనిల్ పాల్గొన్నారు.