SPOT VOICE
Newspaper Banner
Date : 18 June 2026, 8:46 am Posted By : SPOT VOICE MEDIA

ఎల్లమ్మ–దుర్గమ్మ గుడిలో చోరీ..

రఘునాథపల్లి మండలంలో భయం

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండలంలో వరుస దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున మండలంలోని ఖిలాషాపురం గ్రామంలో ఉన్న ఎల్లమ్మ–దుర్గమ్మ దేవాలయంలో చోరీ చోటుచేసుకుంది. దుండగులు గుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహానికి ఉన్న వెండి కళ్లను, ముక్కు ఆభరణాలను తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే హుండీలో ఉన్న నగదును కూడా ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్తులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఇటీవల మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజల్లో భయం నెలకొంది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.