SPOT VOICE
Newspaper Banner
Date : 07 June 2026, 9:41 pm Posted By : SPOT VOICE MEDIA

క్రీడలతో పాటు సామాజిక స్పృహ అవసరo

బ్యాడ్మింటన్ కోచ్ మామిడిశెట్టి రవీందర్

స్పాట్ వాయిస్, ​గణపురం: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు సామాజిక సేవా భావాన్ని పెంపొందిస్తాయని బాల్ బ్యాడ్మింటన్ కోచ్ మామిడిశెట్టి రవీందర్ అన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు ఆదేశాల మేరకు గణపురంలో నిర్వహించిన 45 రోజుల సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. శిక్షణలో భాగంగా క్రీడాకారులు స్థానిక చారిత్రాత్మక కోటగుళ్ల పరిసరాలను శ్రమదానంతో శుభ్రం చేశారు. క్యాంప్ విజయవంతానికి సహకరించిన సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులకు కోచ్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల ఆసక్తి మేరకు ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు గణపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కోచ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9030936615 నంబర్‌లో సంప్రదించాలని వారు కోరారు.