SPOT VOICE
Newspaper Banner
Date : 25 June 2026, 6:35 pm Posted By : SPOT VOICE MEDIA

కారు ఢీకొని గ్రామపంచాయతీ కార్మికుడి మృతి

రఘునాథపల్లిలో విషాదం

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామపంచాయతీ కార్మికుడు కర్రే ఎల్లయ్య (55) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం, రఘునాథపల్లి బ్రిడ్జిపై రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు ఎల్లయ్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ వాహనంతో పరారైనట్లు సమాచారం. మృతుడు గత 20 ఏళ్లుగా రఘునాథపల్లి గ్రామపంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎల్లయ్య ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.