స్పాట్ వాయిస్, దామెర : దామెర పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఈ. వీరభద్రరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన కొంక అశోక్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పోలీసింగ్ అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.