SPOT VOICE
Newspaper Banner
Date : 13 June 2026, 5:57 am Posted By : SPOT VOICE MEDIA

రఘునాథపల్లి జాతీయ రహదారిపై మళ్ళీ యాక్సిడెంట్ 

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : గుల్బర్గా నుండి వరంగల్‌కు వస్తుండగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధన్ గిరి దర్గా సమీపంలో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఎర్టిగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హన్మకొండ నయీమ్ నగర్‌కు చెందిన హబీబా హఫ్సా (27), అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వరంగల్‌కు చెందిన ఖాసిం ఖాన్ బియాబాని గారి తమ్ముడు రహీముద్దీన్ ఖాన్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. కారులో ఉన్న మిగతా నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అడ్వకేట్ జమాల్ షరీఫ్ జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు సహాయం అందించారు. కారు వారి కుటుంబ సభ్యులే నడుపుతున్నట్లు సమాచారం.