బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్.. నలుగురికి గాయాలు…
జయశంకర్ జిల్లా గణపు రం మండలం లో గొల్లపల్లిలో ఘటన స్పాట్ వాయిస్, గణపురం: మండల పరిధిలోని చెల్పూర్ - గొల్లపల్లి రోడ్డు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గొల్లపల్లి గ్రామానికి చెందిన గాజర్ల కమలాకర్ తన భార్య మానస లక్ష్మి, కుమారుడు సిద్దిక్, కూతురు సాత్వికతో కలిసి చెల్పూర్ లో షాపింగ్ పూర్తి చేసుకుని ద్విచక్ర...