SPOT VOICE
Newspaper Banner
Date : 09 June 2026, 3:54 pm Posted By : SPOT VOICE MEDIA

బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్.. నలుగురికి గాయాలు…

జయశంకర్ జిల్లా గణపు రం మండలం లో గొల్లపల్లిలో ఘటన

స్పాట్ వాయిస్, గణపురం: మండల పరిధిలోని చెల్పూర్ – గొల్లపల్లి రోడ్డు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గొల్లపల్లి గ్రామానికి చెందిన గాజర్ల కమలాకర్ తన భార్య మానస లక్ష్మి, కుమారుడు సిద్దిక్, కూతురు సాత్వికతో కలిసి చెల్పూర్ లో షాపింగ్ పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో చెల్పూర్ – గొల్లపల్లి రహదారిపై ఎదురుగా నారాయణపురం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి నలుగురు రోడ్డుపై పడిపోవడంతో వారికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు..