SPOT VOICE
Newspaper Banner
Date : 08 May 2026, 11:52 am Posted By : SPOT VOICE MEDIA

ఏనుమాములు మార్కెట్‌లో మళ్లీ కలకలం

*ఏనుమాములు మార్కెట్‌లో మళ్లీ కలకలం*

* మరో మిర్చి వ్యాపారి పరార్.. 

* రైతులు, అడ్తిదారుల్లో ఆందోళన

స్పాట్ వాయిస్, వరంగల్:వరంగల్ ఏనుమాములు మార్కెట్‌లో మరో మిర్చి వ్యాపారి బోర్డు తిప్పేసినట్లు తెలుస్తుంది. వ్యాపారి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. అడ్తి దారులు, రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులు క్రితం.. రూ. 1.4 కోట్లతో ఓ వ్యాపారి ఉడాయిoచడoతో పోలీసులు రిమాండ్ కు తరలించారు. తాజాగా మరో వ్యాపారి అదే తీరుగా చేయండo కలకలం నెలకొన్నది. అయితే సదరు వ్యాపారి సుమారు రూ.4 కోట్ల వరకు మిర్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.