SPOT VOICE
Newspaper Banner
Date : 06 May 2026, 8:55 am Posted By : SPOT VOICE MEDIA

మహిళపై ఓ కానిస్టేబుల్ దాడి…

ఆలస్యంగా వెలుగులోకి ఘటన….

స్పాట్ వాయిస్ కాజీపేట: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓ యువతిపై చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనను అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో పాటుగా స్థానికులను ఆగ్రహనికి గురి చేసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట పట్టణ శివారులోని ఎస్బిఐ బ్యాంకు ఎదుట కొన్ని రోజుల క్రితం చీకటి పడుతున్న సమయంలో బ్యాంకు వద్ద ఓ కానిస్టేబుల్ (సివిల్ దుస్తులు), తనతో పాటు ఉన్న ఓ మహిళను బ్యాంకు ముందు రోడ్డుపై ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, కొట్టాడు. ఈ ఘటన తో బ్యాంకు ఏటీఎం కు వచ్చిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ సంఘటనను చూస్తుండగా పోలీస్… నేను పోలీస్ కానిస్టేబుల్ ను, బ్యాంకు వద్దకు వచ్చిన, ఇది మా ఇంటి సమస్య అంటూ, ఇక్కడి నుండి వెళ్లిపోమని హుకుం జారీ చేశాడు. కానిస్టేబుల్ మాటలకు భయభ్రాంతులకు గురై వారంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనా సమయంలో ఎస్‌బీఐ బ్యాంక్ సీసీ కెమెరాలు సహా, చుట్టుపక్కల కెమెరాల్లో సంఘటన పూర్తిగా రికార్డ్ అయినట్లు సమాచారం దీంతోపాటు బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన పోలీసు, రోడ్డుపై మహిళపై దాడి చేయడం స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా అధికారులు ఎస్‌బీఐ బ్యాంకు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి,ఆ కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.