జనగామ జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్‌గా గోపగోని శ్రీధర్ గౌడ్
స్పాట్ వాయిస్, జనగామ : తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర సర్వసభ సమావేశం సందర్భంగా జనగామ జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్‌గా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా సర్పంచులు చైతన్యవంతులై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థంగా అమలు చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.నూతన కన్వీనర్‌గా ఎంపికైన...