SPOT VOICE
Newspaper Banner
Date : 28 May 2026, 9:01 pm Posted By : SPOT VOICE MEDIA

జనగామ జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్‌గా గోపగోని శ్రీధర్ గౌడ్

స్పాట్ వాయిస్, జనగామ : తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర సర్వసభ సమావేశం సందర్భంగా జనగామ జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్‌గా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా సర్పంచులు చైతన్యవంతులై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థంగా అమలు చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.నూతన కన్వీనర్‌గా ఎంపికైన గోపగోని శ్రీధర్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులందరితో సమన్వయం సాధించి పార్టీలకు అతీతంగా పని చేస్తూ గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు జనగామ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.