SPOT VOICE
Newspaper Banner
Date : 01 May 2026, 8:27 am Posted By : SPOT VOICE MEDIA

కోతుల దాడిలో వ్యక్తి మృతి..

కోతుల దాడిలో వ్యక్తి మృతి

భూపాలపల్లి లో విషాదం..

స్పాట్ వాయిస్, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో కోతుల దాడిలో ఒకరి ప్రాణం పోయిoది. హరికృష్ణ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కోతుల గుంపు దాడి చేయగా, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొనగా, కోతుల బెడదతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.