గబ్బేట గ్రామంలో అగ్నిప్రమాదం…
గబ్బేట గ్రామంలో అగ్నిప్రమాదం… 10 మంది రైతులకు నష్టం స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండలం గబ్బేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డి వాముకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించి పరిసరాల్లోని వ్యవసాయ పొలాలకు చేరాయి.మంటల కారణంగా పొలాల్లో నిల్వ ఉంచిన గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కోతి సోమయ్యకు చెందిన వ్యవసాయ మోటార్లు, గంగసాని అరవింద్ రెడ్డికి చెందిన ధాన్యం కుప్పలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ఘటనలో దాదాపు 10 మంది రైతులు...