SPOT VOICE
Newspaper Banner
Date : 22 May 2026, 4:38 pm Posted By : SPOT VOICE MEDIA

గబ్బేట గ్రామంలో అగ్నిప్రమాదం…

గబ్బేట గ్రామంలో అగ్నిప్రమాదం…

10 మంది రైతులకు నష్టం

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండలం గబ్బేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డి వాముకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించి పరిసరాల్లోని వ్యవసాయ పొలాలకు చేరాయి.మంటల కారణంగా పొలాల్లో నిల్వ ఉంచిన గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కోతి సోమయ్యకు చెందిన వ్యవసాయ మోటార్లు, గంగసాని అరవింద్ రెడ్డికి చెందిన ధాన్యం కుప్పలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ఘటనలో దాదాపు 10 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం. స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధితులకు ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.