SPOT VOICE
Newspaper Banner
Date : 08 May 2026, 8:17 am Posted By : SPOT VOICE MEDIA

భార్యతో గొడవపడి.. బావిలో దూకిన భర్త..

  • శాయంపేట మండలంలో విషాద ఘటన

స్పాట్ వాయిస్ , వరంగల్ : శాయంపేట మండలం పత్తిపాక లో విషాద ఘటన నెలకొంది. ఓ వ్యక్తి క్షణికావేశంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (58) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 8న భార్య శారదతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి.. బావిలో దుకాడు. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు