SPOT VOICE
Newspaper Banner
Date : 02 May 2026, 10:10 pm Posted By : SPOT VOICE MEDIA

జనగామ డీసీసీ కమిటీలో రఘునాథపల్లి మండలానికి పెద్దపీట

ఉపాధ్యక్షులుగా.. ఇద్దరు మాజీ జెడ్పిటిసి లకు అవకాశం…

స్పాట్ వాయిస్, రఘునాథ పల్లి: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీని పిసిసి ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా రఘునాథపల్లి మండలం మాజీ జెడ్పిటిసి లింగాల జగదీశ్ చందర్ రెడ్డి, లింగాల గణపురం మండలం మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డిలను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు రఘునాథ్ పల్లి మండలం చెందినవారు విశేషం. కార్యకర్త నుండి జిల్లా ఉపాధ్యక్షులు ఎదిగిన ఇద్దరు ప్రజా సంక్షేమ కోసం కార్యకర్తల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తులు. గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన మరింత పోలోపేతం చేస్తానని చెప్పారు.