SPOT VOICE
Newspaper Banner
Date : 04 May 2026, 7:21 am Posted By : SPOT VOICE MEDIA

డీసీసీ సెక్రటరీగా చాడా శ్రీనివాసరెడ్డి 

శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు


స్పాట్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాడ శ్రీనివాసరెడ్డి హనుమకొండ జిల్లా డీసీసీ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటనలో పేర్కొన్నారు. చాడ శ్రీనివాసరెడ్డి మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం చాడ శ్రీనివాసరెడ్డిని డీసీసీ సెక్రటరీగా నియమించింది. ఈ సందర్భంగా చాడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, బంధు మిత్రులు శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.