SPOT VOICE
Newspaper Banner
Date : 19 May 2026, 8:46 am Posted By : SPOT VOICE MEDIA

ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి 

ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి

స్పాట్ వాయిస్, వరంగల్ :ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 20 డివిజన్ పద్మ నగర్ కి చెందిన వెల్దండి వరుణ్(32) వ్యక్తిగత పనులపై మంగళవారం తెల్లవారుజామున కారులో నర్సంపేటకు వెళుతుండగా వరంగల్ – నరంపేట ప్రధాన రహదారి గిర్ని బావి వద్ద అతివేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని వరంగల్ ఎంజీఎం కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. వెల్దండి వరుణ్ బీడీ కార్ఖానా నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా అతడికి భార్య నిఖిత, కుమారుడు హైత్విక్ (8) కూతురు ఆహనా (6) వున్నారు. కాగా.. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. .