SPOT VOICE
Newspaper Banner
Date : 04 May 2026, 9:02 pm Posted By : SPOT VOICE MEDIA

రఘునాథపల్లిలో మద్యం వ్యాన్ బోల్తా…

డ్రైవర్ కు గాయాలు….
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి రాంపూర్ నుంచి మద్యాన్ని డీసీఎంలో తీసుకొని వస్తుండగా బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో సీసాలు పగిలిపోవడంతో పాటు డ్రైవర్ కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.