జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్…
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారులు.. ప్రజలకు విలువనివ్వాలని, స్నేహపూర్వంకంగా మెలగాలని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ లో డీసీపీ తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఫైల్స్ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి ఎస్సై దుదిమెట్ల నరేష్ యాదవ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.