జాతీయ రహదారులో ట్రాఫిక్ జామ్..
కాంచనపల్లి రోడ్డులో ప్రజలు భక్తులతో కిటకిట….
రఘునాథపల్లి, స్పాట్ వాయిస్: హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో మంగళవారం వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రఘునాథ్ పల్లి మండలం కంచనపల్లి గ్రామంలో మంగళవారం దుర్గమ్మ పండుగ ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న బంధువులతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలు వాహనాల్లో ఆటోల్లో తరలిరావడంతో అడుగడుగునా కిటకిటలాడింది. మూడు కిలోమీటర్ల వరకు అడుగడ వాహనాలు,భక్తులు,ప్రజలతో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి మేకలను బలి ఇస్తున్నారు.