SPOT VOICE
Newspaper Banner
Date : 24 April 2026, 11:02 am Posted By : SPOT VOICE MEDIA

శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి

 శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ 

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్ : తమ న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిన్న ఆత్మ హత్యకు పాల్పడ్డ డ్రైవర్ శంకర్ గౌడ్ మృత దేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది పూలమాల వేసి నివాళులార్పించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆయన   కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని పెద్ది డిమాండ్ చేసారు. ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆ ధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.