SPOT VOICE
Newspaper Banner
Date : 05 April 2026, 10:10 am Posted By : SPOT VOICE MEDIA

జయశంకర్ జిల్లాలో దారుణ ఘటన

స్పాట్ వాయిస్, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు  Gramam lo ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటోంది. ఈక్రమంలో కుమారులు గ్రామానికి రాగా మరో మహిళతో ఉండటం గమినించి దాడి చేసినట్లు సమాచారం. చేరాలుకు తీవ్ర గాయాలవడంతో MGMకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మర్డర్ జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళా పరకాల హాస్పిటల్ లో చికిత్స పలుతున్నట్లు  సమాచారo.  చేరాలకు భార్య సులోచన, కూతుళ్లు సరిత, సౌజన్య, కొడుకులు రామ్, లక్ష్మణ్ ఉన్నారు.