ఇంటర్ లోమోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రిన్సిపాల్ తిరుపతి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 72 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 61 మంది (85 శాతం), ద్వితీయ సంవత్సరంలో 86 మందికి గాను 71 మంది (82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో.. బి. కీర్తన (ఎంపీసీ) 444/470, కె. కీర్తన (బీపీసీ) 400/440, టి. బాలకృష్ణ (సీఈసీ) 313/500 మార్కులతో సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరంలో.. ఎం. సృస్థిత (బీపీసీ) 969/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఎం. లహరి (ఎంపీసీ) 896, ఎస్. శ్వేత (సీఈసీ) 861 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు.
