SPOT VOICE
Newspaper Banner
Date : 25 April 2026, 10:47 am Posted By : SPOT VOICE MEDIA

సమ్మెకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి:   ఆర్టీసీలో కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన సమ్మెలో తోటి కార్మికుడు శంకర్ గౌడ్ మృతి బాధాకరమని, ఆర్టీసీ కార్మికుల కోసం ఆయన ప్రాణత్యాగం చేసినందుకు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు జనగామ డిపో జేఏసీ నేత కుర్ర సురేందర్ గౌడ్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే సమ్మెకు మద్దతు తెలిపిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి, పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డికి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు, ఎమ్మార్పీఎస్, సిపిఎం, సిపిఐ, బిజెపి, వివిధ సంఘాల నాయకులకు, మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం జనగామ డిపో జేఏసీ నాయకులు కుర్ర సురేందర్ గౌడ్, యాదగిరి, వీరేందర్, మమత, నరసయ్య, భద్రయ్య ఉన్నారు..