స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి : సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి.. గురువారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ బొల్లపల్లి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ కష్టపడే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనం నరేందర్ రెడ్డి అని ఆయన అన్నారు. నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.