*చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం…. స్నేహభావం తో ముందుకు వెళ్లాలి…
సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ యాదవ్…
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : వేసవికాలంలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని.., స్నేహభావంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని రఘునాథపల్లి సబ్ ఇన్స్పెక్టర్ దూదిమెట్ల నరేష్ యాదవ్, సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ అన్నారు.శుక్రవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో గర్వందుల యాదలక్ష్మి స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయగా వారికి అండగా పోలీసులు నిలిచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వివిధ పనుల కోసం మారుమూల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజా సంక్షేమ కోసం ప్రజల కోసం స్నేహభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి వైన్స్ అధినేతలు గర్వందుల లక్ష్మయ్య,గర్వాంధుల అశోక్ గౌడ్,గర్వాంధుల అనిల్ గౌడ్,చెరుకు అజయ్ గౌడ్,మాజీ సర్పంచులు రంగు అంజయ్య గౌడ్,కొయ్యడ మల్లేష్ మాదిగ, సాయిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి, బిక్షపతి నాయక్, యాదగిరి, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.