బహిరంగ మూత్రవిసర్జన చేస్తే రూ. 500 జరిమానా

26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి-శ్రీనివాస్ హెచ్చరిక స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: పట్టణంలోని పరిసరాల పరిశుభ్రతను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని 26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి- శ్రీనివాస్ స్పష్టం చేశారు. 26వ వార్డులోని మెయిన్ రోడ్డు నుంచి జయశ్రీ టాకీస్, ఫారెస్ట్ ఆఫీస్ కాంపౌండ్ మధ్య ఉన్న రహదారిపై పాదచారులు, వ్యాపారస్తులు బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తుండటంతో స్థానిక నివాసితులకు, ముఖ్యంగా మహిళలకు తీవ్ర ఇబ్బందులు...