కేయూ లో ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
శ్రీవిద్య ఆత్మహత్య కేసులో వీసీ నిర్ణయం స్పాట్ వాయిస్, ఓరుగల్లు : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కాలేజ్‌లో చదువుతున్న ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) సెకండియర్ విద్యార్థిని పి. శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో ఆరుగురు విద్యార్థినులపై కేయూ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఒక సెమిస్టర్ వరకు వారిని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు సీనియర్లు తనపై దొంగతనం మోపడం తోపాటు రూమ్ లో వేసి చితకబాదారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా విద్యార్థిని శ్రీ విద్య మార్చి 16న ఆత్మహత్య...