కేటీపీపీలో అగ్ని ప్రమాదం 

ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ (బొగ్గు చూర) ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రత కారణంగా ఎండ వేడికి బొగ్గు నిల్వల్లో మంటలు పుట్టినట్లు తెలుస్తోంది. గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. కిలోమీటర్ల మేర నల్లని పొగ...