అదనపు కట్నం కోసం పెండ్లి కొడుకు పరార్..
పురుగుల మందు డబ్బాతో అమ్మాయి కుటుంబం ధర్నా కమలాపూర్ మండలంలో ఘటన స్పాట్ వాయిస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారైన ఘటన కలకలం రేపింది. మార్చి 6వ తేదీన జరగాల్సిన పెళ్లికి రెండు రోజుల ముందే వరుడు కనిపించకుండా పోయాడని పెళ్లి కూతురు తండ్రి పొన్నాల రాజయ్య తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు అబ్బాయి ఇంటి ముందు మంగళవారం పురుగుల మందు డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.....