పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి
ఏడుగురి అరెస్టు స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచిన పోలీసులు, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.10,170 నగదుతో పాటు, 06 మొబైల్ ఫోన్లు, 04 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం గణపురం పోలీస్ స్టేషన్...