వడదెబ్బతో కౌలురైతు మృతి..
గణపురంలో విషాదం.. పొలంలోనే కుప్పకూలిన తిరుపతి అనాథలైన భార్య, ఇద్దరు పిల్లలు స్పాట్ వాయిస్, గణపురం: భానుడి ప్రతాపానికి జిల్లాలో ఓ నిరుపేద కౌలురైతు బలైపోయాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో వడదెబ్బ తగిలి పెండ్యాల తిరుపతి (34) అనే రైతు పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. తిరుపతి గ్రామానికి చెందిన శ్రీపతి రాజనర్సు వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పనుల నిమిత్తం చేనుకు వెళ్లిన ఆయన, రాత్రి వరకు తిరిగి...