SPOT VOICE
Newspaper Banner
Date : 18 April 2026, 8:35 am Posted By : SPOT VOICE MEDIA

దామెర లో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్

స్పాట్ వాయిస్ , దామెర. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ అరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టారు. దామెర ఎస్సై అశోక్ దామెర బస్టాండ్ వద్ద దామెర 108 అంబులెన్స్ సిబ్బందితో కలిసి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వెంటనే స్పందించి ఎలా ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కు తరలించాలని (నకిలీ) డమ్మీ యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసి అవగాహన కల్పించారు. అలాగే బస్సు ప్రయాణికులతో ఎస్ఐ అశోక్ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేపించారు.అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.