SPOT VOICE
Newspaper Banner
Date : 29 April 2026, 9:39 pm Posted By : SPOT VOICE MEDIA

క్రమశిక్షణ, అంకితభావంతోనే ఉద్యోగికి గుర్తింపు..

* కరీంనగర్ డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటరమణ 
* ఘనంగా హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి పదవీ విరమణ
* మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల ఘన సన్మానం
* సేవలను కొనియాడిన తోటి ఉద్యోగులు,పూర్వ విద్యార్థులు
* భావోద్యోగానికి గురైన వైద్యులు, సహఉద్యోగులు..
స్పాట్ వాయిస్, జమ్మికుంట : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసే ప్రతి ఉద్యోగి వృత్తి జీవితంలో అత్యున్నత స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అలాంటి గుణాలు కలిగి ఉన్న హెల్త్ ఎడ్యుకేటర్ అడిదెల మోహన్ రెడ్డికి మంచి పేరును, గుర్తింపును తెచ్చిపెట్టాయని కరీంనగర్ డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఎడ్యుకేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న అడిదెల మోహన్ రెడ్డి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవం బుధవారం జమ్మికుంటలోని బీఎస్ఆర్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా కరీంనగర్ డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటరమణ హా జరై మోహన్ రెడ్డి వసుమతి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి 35 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను క్రమశిక్షణ, నీతి నిజాయితీతో పాటు ఓపిక సహనంతో పనిచేసిన మోహన్ రెడ్డి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీ సుకువచ్చారన్నారు. గతంలో ఆయన ప్రైవేటు విద్యారంగంలో, ఆ తరువాత ప్రస్తుతం ప్రభుత్వ వైద్య రంగంలో విశేష సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో చేసిన సేవలకు గుర్తింపుగా అనేక ప్రశంసలు, అవా ర్డులు అందుకోవడం గర్వించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సహఉద్యోగులు భావోద్యోగానికి గురయ్యారు. ఆయనతో కలిసి పనిచేసిన, గడిపిన జ్ఞాపకాలను, చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మోహన్ రెడ్డి-వసుమతి దంపతులను వావివాల, ఇల్లంతకుంట పీహెచ్ సీ సిబ్బంది, పూర్వ విద్యార్ధులు, తదితరులు ఘనంగా సన్మానించారు.

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సమాజ సేవలో కొనసాగుతూ గడవాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ శ్రవణ్ కుమార్, పీఓఎంసీహెచ్ డాక్టర్ సన జవేరియా, వావిలాల వైద్యాధికారిణి డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, హుజురాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ జి.తిరుపతి, డాక్టర్ హరినాథ్ బాబు, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, సూపర్ వైజర్ అరుణ, సదానందం, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.