SPOT VOICE
Newspaper Banner
Date : 01 April 2026, 4:13 pm Posted By : SPOT VOICE MEDIA

మహిళా అదృశ్యం విషాదాంతం..

గణపసముద్రం చెరువులో లావణ్య మృతదేహం లభ్యం

స్పాట్ వాయిస్, ​గణపురం: మండల కేంద్రానికి చెందిన వివాహిత సిరంగి లావణ్య (38) అదృశ్యం ఉదంతం విషాదంగా ముగిసింది. మంగళవారం కనిపించకుండా పోయిన ఆమె.. బుధవారం స్థానిక గణపసముద్రం చెరువులో శవమై తేలింది. మండల కేంద్రంలో నివాసముండే సిరంగి కుమారస్వామి భార్య లావణ్య మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్ళిపోయింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో కుమారస్వామి పోలీసులను ఆశ్రయించారు. కాగా, ​బుధవారం మధ్యాహ్నం చెరువులో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా లావణ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అదృశ్యమైన లావణ్య మరణంతో మండల కేంద్రంలో విషాద చాయలు అలుముకున్నాయి.