భార్యే హత్యే చేపించినట్లు స్థానికుల అనుమానాలు
నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువుల డిమాండ్
స్పాట్ వాయిస్, పరకాల: పరకాలలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. అయితే అది హత్యేనని, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివారలిలా ఉన్నాయి. పరకాల పట్టణంలోని ఓ యువకుడి భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ బంధం బయటపడిన నేపథ్యంలో వారి దాంపత్య జీవితంలో కలహాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలనే ఉద్దేశంతో భార్య ముందుగానే పథకం రచించి, కొంతమంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చి హత్య చేయించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పరకాల పట్టణంలో భయాందోళనలు కలిగించగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.