SPOT VOICE
Newspaper Banner
Date : 20 April 2026, 1:29 pm Posted By : SPOT VOICE MEDIA

రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్..

జగిత్యాల బహిరంగ సభ స్టేజీ ఇంచార్జి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత అజయ్ మణికంఠ

 స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని ఆయన చరిత్రను ఎవరు చేరుపలేరని జనగామ జిల్లా జడ్పీటీసీ ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్ మణికంఠ అన్నారు. ఆయనకు బహిరంగ సభ స్టేజీ ఇంచార్జిగా నియమించడంతో రెండు రోజులు నుండి అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు.సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టే విధంగా పనిచేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ సభను విజయవంతo చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సభకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మండల బి ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు దుబ్బాక హరీష్ గౌడ్, . బాల్నే పరుశురాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.