SPOT VOICE
Newspaper Banner
Date : 22 April 2026, 2:09 pm Posted By : SPOT VOICE MEDIA

‘ఫారిన్ స్టైల్ ప్రపోజల్’…., మర్డర్

  • కుర్చీకి కట్టేసి.. కిరోసిన్ పోసి..
  • ప్రేమ పేరుతో ప్రియుడి హత్య
  • పట్టించుకోవడం లేదనే ప్రియురాలి అనుమానం
  • బెంగళూరులో దారుణం.

స్పాట్ వాయిస్ వరంగల్: బెంగళూరు రాజాజీనగర్ పరిధిలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే స్టోర్‌లో పని చేస్తూ పరిచయం అయిన కిరణ్ మరియు ప్రేమ మధ్య ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ప్రేమలో కోపం పెరిగింది.

  • ఎలా చేసింది..?

ప్రేమ, “ప్రపోజ్ చేయాలి” అనే నెపంతో కిరణ్‌ను తన ఇంటికి పిలిపించింది. మొదట ప్రేమగా మాట్లాడి అతనిని నమ్మించింది. ఆ తర్వాత ఒక్కసారిగా దారుణానికి దిగింది.
కిరణ్ చేతులు, కాళ్లు కట్టేసింది. కళ్లకు గంతలు కట్టింది. ఎందుకు కడుతున్నావు అని కిరణ్ అడిగితే ఇదంతా ఫారిన్ స్టైల్ ప్రపోజల్ అని నమ్మించింది. తర్వాత అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ దారుణాన్ని ప్రేమ తన ఫోన్‌లో వీడియో తీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇది ఘటనను మరింత భయానకంగా మార్చింది. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రేమను అరెస్ట్ చేశారు. ప్రేమపై హత్య కేసు నమోదు. వీడియో ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ముందుగా ప్లాన్ చేసిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రేమ పేరుతో ఇంత దారుణానికి దిగడం సమాజాన్ని కుదిపేసింది. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.