SPOT VOICE
Newspaper Banner
Date : 26 April 2026, 7:43 pm Posted By : SPOT VOICE MEDIA

ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి

స్పాట్ వాయిస్,రేగొండ: ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు మృతి చెందిన ఘటన కొత్తపల్లిగోరి మండల పరిధిలోని పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై చలివాగు వద్ద ఆదివారం జరిగింది. రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన సుంకరి రవీందర్ (45) ఆదివారం పరకాలలో బంధువుల పెళ్లి ఉండగా ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు. పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా చలివాగు వద్ద భూపాలపల్లి నుంచి పరకాలకు వెళ్తున్న బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రవీందర్ కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రమా, కుమారుడు అజయ్, కూతురు వర్షిణి ఉన్నారు. భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి గోరి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి తెలిపారు.