SPOT VOICE
Newspaper Banner
Date : 30 April 2026, 6:41 am Posted By : SPOT VOICE MEDIA

టెన్త్ రిజల్ట్స్‌ లో అదరగొట్టిన ఆదర్శ విద్యార్థులు

ఆదర్శ ఉన్నత పాఠశాల అద్భుత ఫలితాలు

స్పాట్ వాయిస్, హన్మకొండ : ఈ ఏడాది నిర్వహించిన పదవ తరగతి  ఫలితాల్లో ఎక్సైజ్ కాలనీలోని ఆదర్శ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులు సాధించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, యాజమాన్యం సమర్థమైన మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని డైరెక్టర్ శివ నాగేశ్వరరావు, నరసింహారావు, శ్రీపాల్ రెడ్డి తెలిపారు.

ఆదర్శ ఆణిముత్యాలు

డి.ఇందుప్రియ 585

టి.శ్రీకర్ 579

ఎం. తేజస్విన్ రెడ్డి574

ఏ. వసంత్ వర్మ 574

టి.స్వజిత్ 567

జి. మనోశోదన్ 564

జి. శ్రీజ 561

అదరగొట్టిన ఆదర్శ విద్యార్థులు

మొత్తం 42 మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి రికార్డు నెలకొల్పారు. గణితంలో నలుగురు విద్యార్థులు నూటికి నూరు మార్కులు సాధించడం విశేషం.ముఖ్యంగా పరీక్షలకు ముందు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతులు, రివిజన్ సెషన్లు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ విద్యార్థుల విజయానికి దోహద పడ్డాయన్నారు.

అతి స్వల్ప కాలంలోనే అద్భుత ఫలితాలు..

పాఠశాల డైరెక్టర్లు శివ నాగేశ్వరరావు, నరసింహారావు, శ్రీపాల్ రెడ్డి భవిష్యత్తులో నూ ఇలాంటి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. నాగేశ్వరరావు ట్యూషన్ సెంటర్ హంటర్ రోడ్డులో ఐఐటి /జేఈఈ శిక్షణ పొందుతూ అతి స్వల్ప కాలంలోనే అద్భుత ఫలితాలు సాధించిన ఆదర్శ ఆణిముత్యాలను డైరెక్టర్లు అభినందించారు. “విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత కలిసినప్పుడు విజయాలు సహజం” అని తెలిపారు.తల్లిదండ్రులు కూడా పాఠశాల సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ ఫలితాలతో ఆదర్శ ఉన్నత పాఠశాల మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది.

School